మెన్స్ హాకీ ఫైనల్‌లో భారత్ ఘన విజయం

129చూసినవారు
ఆసియా క్రీడల్లో మెన్స్ హాకీ జట్టు ఫైనల్‌లో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో భారత్ మరో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. మలేషియాపై భారత్ 5-1 తేడాతో గెలిచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్, జుగ్రాజ్ సింగ్, హార్దిక్, లక్రా తలో గోల్ కొట్టారు. కాగా, మొత్తం 21 గోల్డ్ మెడల్స్‌తో ఇండియా టేబుల్‌లో 4వ స్థానానికి చేరింది.

సంబంధిత పోస్ట్