షాట్‌పుట్‌లో భారత్‌కు రజతం.. తజిందర్ పాల్ రికార్డు

21చూసినవారు
భారత స్టార్ షాట్‌పుటర్ తజిందర్ పాల్ సింగ్ తూర్ ఆసియా క్రీడల్లో పురుషుల ఫైనల్‌లో 20.64 మీటర్ల అత్యుత్తమ త్రోతో రజత పతకాన్ని సాధించాడు. దీంతో ఆసియా క్రీడల్లో వరుసగా మూడోసారి పతకం అందుకుని రికార్డు నెలకొల్పాడు. అయితే 2018, 2022 ఆసియా క్రీడల్లో స్వర్ణాలు గెలిచిన తజిందర్, ఈసారి మాత్రం రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇరాన్‌కు చెందిన మహ్మద్‌ రెజా తైబీసే 20.81 మీటర్ల త్రోతో స్వర్ణం గెలిచి ఆసియా క్రీడల రికార్డును బద్దలు కొట్టాడు. సౌదీ అరేబియాకు చెందిన మహ్మద్‌ టోలు కాంస్యం సాధించాడు.

సంబంధిత పోస్ట్