భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో సౌతాఫ్రికాపై 52 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 298/7 స్కోరు చేసింది. ఛేదనలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 రన్స్‌కు ఆలౌట్ అయి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 4, షెఫాలీ వర్మ 2 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు. గతంలో 2005, 2017లో ఫైనల్ వరకు వెళ్లిన టీమిండియా ప్రస్తుతం విజేతగా నిలిచి భారతీయుల గుండెలు ఉప్పొంగేలా చేసింది.