ఆసియా కప్ సూపర్-4లో భాగంగా మరికాసేపట్లో భారత్, పాకిస్తాన్ జట్లు దుబాయ్ వేదికగా తలపడనున్నాయి. ఈ క్రమంలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్‌ను బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించింది. గ్రూప్ దశలో పాక్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన టీమ్‌ఇండియా.. మరోసారి దాయాదిని మట్టికరిపించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఓటమిని జీర్ణించుకోలేని పాక్.. ఈ మ్యాచ్‌లో గెలుపొంది బదులివ్వాలని చూస్తోంది.