
మన దేశంలో కుబేరుడికీ గుడి ఉందని తెలుసా?
ఉత్తరాఖండ్‌లోని కుమావున్ హిమాలయాల్లోని జగేశ్వర్ ధామ్, 124 ఆలయాలతో ఆధ్యాత్మికతకు, వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కుబేర భండారి ఆలయంలో కుబేరుడిని శివుడిగా పూజిస్తారు. రావణుడి చేతిలో ఓటమి తర్వాత శాంతిని కోరుకున్న కుబేరుడు, శివుడు తపస్సు చేసిన లోయ వద్దకు వచ్చి ప్రార్థించగా, శివుడు ఆ లోయలోనే కొలువు ఉంటానని వరం ఇచ్చాడు. దీంతో జగేశ్వర్ ధామ్ కుబేరుడి నివాసంగా మారింది. ఇక్కడ శివుడిని, కుబేరుడిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని, సంపదకు లోటు ఉండదని భక్తుల నమ్మకం.




