సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు అకస్మాత్తుగా తీవ్రమైన మెడనొప్పి రావడంతో, వెంటనే ఆటను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే పరిస్థితి విషమించడంతో ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. కోల్కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. మెడకు సర్వైకల్ కాలర్ వేసి స్ట్రెచర్‌పై తరలించిన దృశ్యాలు బయటకు రావడంతో గిల్‌కు సివియర్ ఇంజూరీ అయినట్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.