ఒడిశాలోని పారదీప్ తీరంలో బ్రెజిల్ జెండాతో వస్తున్న ఎంటీ సీగల్-9 నౌక ఇంజిన్ విఫలమైంది. పామాయిల్‌తో వస్తున్న ఈ నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నారు. అత్యవసర సందేశం అందగానే భారత కోస్ట్‌గార్డ్ అప్రమత్తమైంది. ఐసీజీఎస్ విశ్వస్త్‌ను రంగంలోకి దింపి, సిబ్బంది వేగంగా మరమ్మతులు చేసి లీకేజీని అరికట్టారు. దీంతో నౌక సముద్రంలో మునిగిపోకుండా కాపాడటంతో పాటు 23 మంది సిబ్బందిని రక్షించారు. సముద్రంలో భారీ ప్రమాదం తప్పింది.