భారతదేశ 140 కోట్ల మంది పౌరులకు ప్రధాని నరేంద్ర
మోదీ 'సంవిధాన్ దివస్' సందర్భంగా బహిరంగ లేఖ రాశారు. నవంబర్ 26 భారతీయులందరికీ గర్వకారణ దినమని, రాజ్యాంగ దినంగా పాటించాలని 2015లో నిర్ణయించినట్లు గుర్తుచేశారు. తనలాంటి సామాన్యుడు ప్రధాని కావడం రాజ్యాంగం వల్లే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవం కూడా జరుపుకుంటున్నామని, భారత రాజ్యాంగం మనకెంతో గర్వకారణమని కొనియాడారు.