
మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
మాల్దీవుల్లోని ఉత్తర అటాల్స్లోని హనిమాధూ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేడు (సోమవారం) అధికారికంగా ప్రారంభమైంది. ఆధునిక రూపకల్పనతో నిర్మించబడిన ఈ విమానాశ్రయం ఇప్పుడు ఉత్తర మాల్దీవుల ప్రధాన ల్యాండ్‌మార్క్‌గా నిలిచింది. భారత్ నుంచి సివిల్ ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ వేడుకకు హాజరయ్యారు. భారత్ లైన్ ఆఫ్ క్రెడిట్‌తో 136 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో 2.7 కి.మీ. రన్‌వేతో పాటు ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి.




