
10 అడుగుల కోబ్రా.. చున్నీలా మెడలో చుట్టేసుకుంది (వీడియో)
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో గండక్ నది నీటిమట్టం పెరగడంతో, వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మున్నీ లాల్ ఇంట్లోకి దాదాపు 10 అడుగుల పొడవైన విషపూరితమైన కోబ్రా ప్రవేశించింది. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, మహిళా స్నేక్ క్యాచర్ జానకి దేవి చాకచక్యంగా పామును పట్టుకుని, సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, పాములు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.




