ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ విలువ 4 ట్రిలియన్ డాలర్లను దాటుతుందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) అనంత్ నాగేశ్వరన్ తెలిపారు. ప్రస్తుతం 3.9 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. 'ఐవీసీఏ గ్రీన్ రిటర్న్స్ సమ్మిట్ 2025'లో ఆయన మాట్లాడుతూ, మార్చి 2025 చివరి నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 4 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటుతుందన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో ఆర్థిక వృద్ధి ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.