కెనాడలో వేధింపుల కేసులో భారతీయ వృద్ధుడు బహిష్కరణ

19321చూసినవారు
కెనాడలో వేధింపుల కేసులో భారతీయ వృద్ధుడు బహిష్కరణ
కెనడాలో మనవడిని చూసేందుకు  6 నెలల సందర్శక వీసాపై వెళ్లిన 51 ఏళ్ల భారతీయ వ్యక్తి జగజిత్ సింగ్, స్థానిక పాఠశాల వద్ద ఇద్దరు టీనేజ్ బాలికలను వేధించిన కేసులో దోషిగా తేలాడు. సెప్టెంబర్ 8 నుంచి 11 మధ్య బాలికల వద్దకు వెళ్లి ఫోటోలు దిగే నెపంతో అసభ్యంగా తాకినట్లు ఆరోపణలున్నాయి. బాలికల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, సర్నియా కోర్టులో హాజరుపరిచారు. అతడు అంగీకారించడంతో దీంతో న్యాయస్థానం అతడిని దేశం నుంచి బహిష్కరిస్తూ, శాశ్వతంగా కెనడాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. అతడికి మూడేళ్ల ప్రొబేషన్ కూడా విధించారు.

సంబంధిత పోస్ట్