భారతదేశ ఎన్నికల నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. రాజ్యాంగం, ఎన్నికల చట్టాలు, కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం 1.8 కోట్ల మంది సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. ఈ భారీ యంత్రాంగం నిష్పక్షపాతంగా, జవాబుదారీతనంతో పనిచేస్తూ స్వేచ్ఛాయుత, పారదర్శక
ఎన్నికలు నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.