ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై భారత ప్రభుత్వం పరిమితులు విధించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఎక్స్ యూజర్లు స్పందిస్తున్నారు. భారత ప్రభుత్వం అడల్ట్ కంటెంట్ నిషేధంపై సీరియస్‌గా ఉన్నప్పటికీ, ఎక్స్‌కు పరిమితులు విధించినట్లు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్ కూడా దీనిపై అధికారికంగా వెల్లడించలేదు. అయితే సోషల్ మీడియాలో యూజర్లు చేస్తున్న పోస్టుల ప్రకారం, అడల్ట్ కంటెంట్ తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.