షార్జాలో భారతీయుడి దారుణ హత్య.. కారులో ముక్కలుగా మృతదేహం

15013చూసినవారు
షార్జాలో భారతీయుడి దారుణ హత్య.. కారులో ముక్కలుగా మృతదేహం
షార్జాలో కర్ణాటకకు చెందిన అల్విన్ ప్రకాశ్‌ కుందర్ అనే భారతీయుడి మిస్సింగ్ కేసు విషాదాంతం అయింది. ఆయన మృతదేహం కారులో 9 ముక్కలుగా లభించడం కలకలం రేపింది. జూలై 20న అదృశ్యమైన అల్విన్ కోసం వెతుకుతుండగా, రెండు నెలల తర్వాత ఒమన్ వైపు వెళ్లే మార్గంలో పార్క్ చేసిన కారులో అతని మృతదేహం దొరికింది. హత్యకు కారణాలు, నిందితులెవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో అల్విన్ భార్య టీనా, కుమారుడు ఆచూకీ తెలియకపోవడం కేసును మరింత మిస్టరీగా మార్చింది.

సంబంధిత పోస్ట్