చైనాలో భారతీయ మహిళకు అండగా భారత అధికారులు

11684చూసినవారు
చైనాలో భారతీయ మహిళకు అండగా భారత అధికారులు
షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో తన భారత పాస్‌పోర్ట్‌ను గుర్తించేందుకు చైనా అధికారులు నిరాకరించారని, వేధించారని భారత మహిళ పెమా వాంగ్‌జోమ్‌ థాంగ్‌డోక్‌ పేర్కొన్నారు. చెల్లుబాటయ్యే వీసా ఉన్నా పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుని, జపాన్ విమానం ఎక్కనివ్వలేదని, ఆహారం కూడా కొననివ్వలేదని ఆమె తెలిపారు. భారత విదేశాంగ అధికారుల సహాయంతో ఆమె సమస్య పరిష్కారమైంది. అధికారులు విమానాశ్రయానికి వచ్చి, ఆహారం అందించి, చైనా అధికారులతో చర్చించి ఆమెను బయటకు రావడానికి సహాయం చేశారు.

సంబంధిత పోస్ట్