స్వీడన్ పార్లమెంట్‌కు భారత సంతతి మహిళ ఎన్నిక

29చూసినవారు
స్వీడన్ పార్లమెంట్‌కు భారత సంతతి మహిళ ఎన్నిక
మహారాష్ట్రకు చెందిన విద్యావేత్త అశోక్‌ విఖే పాటిల్‌ కుమార్తె నీలా విఖే పాటిల్‌ (41) స్వీడన్‌ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. సెప్టెంబర్‌ 13న జరిగిన ఎన్నికల్లో స్టాక్‌హోమ్‌ సిటీ నియోజకవర్గం నుంచి ఆమె రిక్స్‌డాగ్‌ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వీడన్‌లో జన్మించిన నీలా బాల్యంలో కొంతకాలం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో గడిపారు. గతంలో స్వీడన్‌ మాజీ ప్రధాని స్టెఫాన్‌ లోవెన్‌ కార్యాలయంలో రాజకీయ సలహాదారుగా పనిచేశారు. అనంతరం స్టాక్‌హోమ్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌లో సభ్యురాలిగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్