
రూ.500 నోట్ల కట్టతో కోతి.. ఒక్క ఫ్రూటీ కోసం వదిలేసింది.. వీడియో వైరల్
యూపీలోని బృందావనంలో ఒక కోతి రూ.500 నోట్ల కట్టను పట్టుకుని కూర్చున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోట్లను వాసన చూసి, చింపే ప్రయత్నం చేసిన కోతి, కింద ఉన్న వ్యక్తి ఇచ్చిన ఫ్రూటీ కోసం ఆ కట్టను విసిరేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా 5.8 మిలియన్ వ్యూస్, లక్షకు పైగా లైకులు వచ్చాయి. నెటిజన్లు “కోతి ధనవంతురాలైంది.. కానీ ఒక్క ఫ్రూటీ కోసం వదిలేసింది”, “ఒక్క ఫ్రూటీకే నోట్ల కట్ట!” అంటూ కామెంట్లు చేస్తున్నారు.




