ఈజిప్ట్‌లో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు అదరగొడుతున్నారు. భారత షూటర్ సామ్రాట్ రాణా వరల్డ్ చాంపియన్‌గా అవతరించాడు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. సోమవారం జరిగిన ఫైనల్‌లో సామ్రాట్ 243.7 స్కోరు చేసి విజేతగా నిలిచాడు. అదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత షూటర్ వరుణ్ తోమర్ కాంస్యం గెలిచాడు. టీమ్ ఈవెంట్‌లోనూ భారత జట్టు స్వర్ణం సాధించింది.