ముంబయి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో భారత్ 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 299 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. బౌలింగ్‌లో దీప్తి శర్మ 5, షెఫాలీ వర్మ 2 వికెట్లతో అదరగొట్టారు. దక్షిణాఫ్రికా చివరి బ్యాటర్ డిక్లెర్క్ బంతిని గాలిలోకి లేపగా.. కౌర్ అద్భుతంగా క్యాచ్‌ను ఒడిసిపట్టడంతో భారత అభిమనుల్లో ఆనందం కట్టలు తెంచుకుంది.