దుబాయ్ ఎయిర్ షోలో శుక్రవారం మధ్యాహ్నం భారత తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. వైమానిక ప్రదర్శన చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానం కూలిపోవడంతో దట్టమైన నల్లటి పొగలు ఎగసిపడ్డాయి, దీంతో ప్రదర్శనను చూస్తున్న వారు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో పైలట్ మృతి చెందాడు.