భారత ట్రావెల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌.. అమెరికాలో మృతి

133చూసినవారు
భారత ట్రావెల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌.. అమెరికాలో మృతి
భారత్‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ ఇన్‌ఫ్లూయెన్సర్, ఫోటోగ్రాఫర్ అనునయ్ సూద్ (32) మృతి చెందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులు గురువారం ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వెల్లడించారు. అనునయ్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. చివరిసారిగా ఆయన లాస్ వెగాస్ నుంచి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. దీంతో అమెరికాలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న అనునయ్, 46 దేశాల్లో పర్యటించారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో 14 లక్షల మంది, యూట్యూబ్‌లో 3.80 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్