బంగ్లాదేశ్‌లోని ఢాకాలో జరిగిన మహిళల కబడ్డీ ప్రపంచకప్ ఫైనల్లో భారత జట్టు చైనీస్ తైపీని 35-28 తేడాతో ఓడించి, వరుసగా రెండోసారి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు, గ్రూప్ దశలో అన్ని మ్యాచ్‌ల్లో గెలిచి, సెమీఫైనల్లో ఇరాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. 2012లో జరిగిన తొలి ప్రపంచకప్‌లోనూ భారతే విజేతగా నిలిచింది. ఈ విజయంతో మహిళల కబడ్డీలో భారత్ సత్తా మరోసారి నిరూపించుకుంది.