
రైలులో కొండచిలువ కలకలం
అండమాన్ ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎస్2 కోచ్ వాష్‌రూమ్‌లో కొండచిలువ కలకలం రేపింది. దీన్ని చూసిన ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురై టీటీఈకు తెలిపారు. అప్పటికే రైలు డోర్నకల్ దాటి విజయవాడ వైపు వెళ్తుండగా టీటీఈ సమాచారం మేరకు రైలు ఖమ్మం చేరుకోగానే ఆర్పీఎఫ్ బృందం స్నేక్ క్యాచర్ మస్తాన్ తో ఆ కొండచిలువను బంధించారు. తక్షణమే స్పందించిన అధికారులకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.




