యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష అంశంతో విదేశాల్లో భారతీయ ఖైదీల పరిస్థితి హాట్‌టాపిక్‌గా మారింది. మార్చి 2025 వరకు సౌదీ అరేబియాలో 2,633, యూఏఈలో 2,518, నేపాల్లో 1,317 మంది భారతీయులు జైల్లో ఉన్నారు. ఖతార్, కువైట్, మలేషియా, యూకే, పాకిస్తాన్‌లలో కూడా శిక్ష అనుభవిస్తున్నారు. 2020 నుంచి 2024 మధ్య 47 మందికి మరణశిక్ష అమలు చేయడం గమనార్హం.