ఆ గ్రీన్‌ కార్డ్‌ లాటరీలో 2028 వరకు భారతీయులకు నోఛాన్స్‌

51చూసినవారు
ఆ గ్రీన్‌ కార్డ్‌ లాటరీలో 2028 వరకు భారతీయులకు నోఛాన్స్‌
అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఆశించే వేలాది మంది భారతీయులకు నిరాశే ఎదురైంది. ప్రతిష్ఠాత్మక డైవర్సిటీ వీసా (డీవీ) లాటరీ జాబితా నుంచి భారత్‌ను మినహాయించారు. అమెరికాకు భారతీయుల వలసలు అధికంగా ఉండటమే కారణం. ఈ నిబంధన 2028 వరకు కొనసాగనుంది. గణాంకాల ప్రకారం 2021లో 93,450 మంది, 2022లో 1,27,010 మంది, 2023లో 78,070 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. గత ఐదేళ్లలో ఏ దేశం నుంచైనా 50,000 కంటే తక్కువ మంది అమెరికాకు వలస వచ్చి ఉంటే, ఆ దేశ పౌరులు మాత్రమే ఈ లాటరీకి అర్హులు.