రెండోరోజు భారీ లాభాల్లో ముగిసిన సూచీలు
By Sai shivani 21చూసినవారుదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండోరోజూ భారీ లాభాల్లో ముగిశాయి. త్రైమాసిక ఫలితాలపై సానుకూల దృక్పథం, ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్ షేర్లు ప్రధానంగా రాణించాయి. సెన్సెక్స్ 862.23 పాయింట్ల లాభంతో 83,467.66 వద్ద, నిఫ్టీ 261.75 పాయింట్ల లాభంతో 25,585.30 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 87.83గా ఉంది.