లాభాల్లో సూచీలు.. ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి బ్యాంక్‌ నిఫ్టీ

194చూసినవారు
లాభాల్లో సూచీలు.. ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి బ్యాంక్‌ నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. కార్పొరేట్ ఫలితాలు, విదేశీ మదుపర్ల పెట్టుబడుల రాక వంటి సానుకూల అంశాలతో సెన్సెక్స్ 84,172 వద్ద, నిఫ్టీ 25,781.50 వద్ద 52 వారాల గరిష్టాలను తాకాయి. శుక్రవారం బ్యాంక్ నిఫ్టీ 57,828.30 వద్ద ఆల్-టైమ్ గరిష్టాన్ని అందుకుంది. చివరికి సెన్సెక్స్ 484.53 పాయింట్ల లాభంతో 83,952.19 వద్ద, నిఫ్టీ 124.55 పాయింట్ల లాభంతో 25,709.85 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 87.82గా ఉంది.

సంబంధిత పోస్ట్