నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు

15847చూసినవారు
నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. రియాలిటీ, ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడితో పాటు, గరిష్ఠాల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు దిగడం సూచీలు ఒత్తిళ్లు ఎదుర్కోవడానికి కారణమైంది. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. సెన్సెక్స్ 150.68 పాయింట్ల నష్టంతో 84,628.16 వద్ద, నిఫ్టీ 29.85 పాయింట్ల నష్టంతో 25,936.20 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 88.27గా ఉంది.