దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, చమురు ధరలు తగ్గడం, ప్రపంచ బాండ్ల రాబడులు బలహీనపడటం, విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం వంటి కారణాలతో సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 564.03 పాయింట్లు పెరిగి 74,858.99 వద్ద, నిఫ్టీ 67.90 పాయింట్లు పెరిగి 23,414.30 వద్ద స్థిరపడ్డాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.80గా ఉంది.