డీలా పడ్డ సూచీలు.. 25,100 దిగువకు నిఫ్టీ

88చూసినవారు
డీలా పడ్డ సూచీలు.. 25,100 దిగువకు నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుసగా నాలుగో రోజు అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. హెచ్-1బీ వీసాలపై ఆందోళనలు, విదేశీ మదుపర్ల విక్రయాలు ఇన్వెస్టర్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫైనాన్షియల్‌, ఐటీ షేర్లు అధికంగా నష్టపోవడంతో సూచీలు డీలా పడ్డాయి. నిఫ్టీ మళ్లీ 25,100 దిగువకు పడిపోయింది. సెన్సెక్స్‌ 386 పాయింట్లు నష్టపోయి 81,715 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు పడిపోయి 25,056 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 88.71గా నమోదైంది.

సంబంధిత పోస్ట్