దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఒక నెటిజన్ ఇండిగో విమానాన్ని ఆటోగా మార్చిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నీలం, తెలుపు రంగుల ఇండిగో స్టైల్ ఆటోను నడుపుతున్న వ్యక్తి, 'బోపాల్ నుంచి ముంబాయ్.. అక్కడి నుంచి దుబాయ్..' అంటూ ప్రయాణికులను పిలుస్తున్నాడు. ఇండిగో సంక్షోభం వేళ AIతో రూపొందించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్‌లు 'ఇండిగో ఎయిర్‌లైన్స్ రద్దు అయిన.. ఇండిగో ఆటో లైన్స్ ఆల్రెడీ టేక్ ఆఫ్ అయ్యాయ్' అంటూ స్పందించారు.