తొమ్మిదో రోజుకు చేరిన ఇండిగో సంక్షోభం

67చూసినవారు
తొమ్మిదో రోజుకు చేరిన ఇండిగో సంక్షోభం
ఇండిగో విమానయాన సంస్థ నిర్వహణ సంక్షోభం తొమ్మిదో రోజుకు చేరింది. మంగళవారం దేశవ్యాప్తంగా దాదాపు 300 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి ప్రధాన విమానాశ్రయాల్లో ఈ రద్దుల ప్రభావం ఎక్కువగా ఉంది. దీనితో వేలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెంగళూరు విమానాశ్రయంలో అత్యధికంగా 121 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్‌లో 58, చెన్నైలో 41, ముంబైలో 31 విమానాలు రద్దు చేయబడ్డాయి.

సంబంధిత పోస్ట్