
ఆన్లైన్లో టెకీ దంపతుల రిసెప్షన్ (వీడియో)
ఇండిగో విమాన సర్వీసుల్లో ఏర్పడిన అంతరాయం కారణంగా ఓ టెకీ జంట తమ వివాహ రిసెప్షన్‌ను ఆన్లైన్లో నిర్వహించాల్సి వచ్చింది. విమానాలు రద్దు కావడంతో పెళ్లి తర్వాత రిసెప్షన్ కోసం నిర్ణయించుకున్న నగరానికి వారు సమయానికి చేరుకోలేకపోయారు. దీంతో, బంధుమిత్రులు, స్నేహితులంతా వారికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ టెకీ దంపతులు వర్చువల్ వేదికగా రిసెప్షన్ వేడుకను నిర్వహించుకున్నారు.




