శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన

19015చూసినవారు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానం ఆలస్యం.. ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్ లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో గురువారం ఇండిగో విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 7:45 గంటలకు పాట్నా వెళ్లాల్సిన విమానం ఇంకా బయల్దేరకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున 5:30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నామని, ఆలస్యం గురించి సమాచారం ఇవ్వలేదని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని ప్రయాణికులు ఇండిగో సిబ్బందిని నిలదీశారు.

సంబంధిత పోస్ట్