బ్యాంకాక్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో
విమానం (6E-1054)లో ప్రయాణికుడి ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో.. శనివారం అర్ధరాత్రి లక్నోలోని చౌధరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. రాత్రి సుమారు 10:55 గంటలకు
విమానం ల్యాండ్ అవ్వగా, విమానాశ్రయంలో సిద్ధంగా ఉన్న వైద్య బృందం అనారోగ్యానికి గురైన ప్రయాణికుడిని గోమతీనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. ప్రక్రియలు పూర్తయ్యాక
విమానం రాత్రి 12:05 గంటలకు ఢిల్లీకి బయలుదేరింది.