
ప్లాస్టిక్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం.. వీడియో
గుజరాత్లోని వల్సాద్ జిల్లా అంబర్గావ్ తాలూకా టుంబ్ గ్రామంలో ప్లాస్టిక్ ముడి పదార్థాల తయారీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.




