'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా'.. గరిష్ఠ వయోపరిమితి 57 ఏళ్లు!

34చూసినవారు
'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా'.. గరిష్ఠ వయోపరిమితి 57 ఏళ్లు!
TG: రేవంత్ సర్కార్ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని త్వరలోనే అమలు చేయనుంది. అయితే ఈ  స్కీమ్‌కు గరిష్ఠ వయోపరిమితిని 57 ఏళ్లుగా నిర్ణయించినట్లు సమాచారం. 60ఏళ్ల వయోపరిమితి ఇవ్వాలనుకున్నా.. లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో తగ్గించాలనే భావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ బీమా ద్వారా కుటుంబంలో ఎవరైనా మరణిస్తే నామినీకి రూ.5 లక్షలు అందజేస్తారు.

సంబంధిత పోస్ట్