ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి రూ.22,500 కోట్లతో 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిందని తెలిపారు. స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు అందిస్తున్నామని, ప్రతి వారం బిల్లులు మంజూరు చేస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి గోదావరిఖనిలో రూ.175 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేసి, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.