ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. అర్హులు వీళ్లే

0చూసినవారు
ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. అర్హులు వీళ్లే
TG: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రూ.12 వేలు లబ్ధిదారులకు అందిస్తోంది. రెండు విడతలుగా రూ.6 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ స్కీమ్‌కు అర్హులు.. తెలంగాణ నివాసి అయి ఉండాలి. తమ పేరుపై ఎలాంటి భూమి కలిగి ఉండకూడదు. ఉపాధి హామీ పథకం కింద కనీసం 20 రోజులు పని చేసి ఉండాలి. అర్హులు రేషన్ కార్డు, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఎమ్మార్వో లేదా వీఆర్వో అందించే భూమి లేదని ధృవీకరించే డాక్యుమెంట్, ఉపాధి హామీ జాబ్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్