TG: ఇందిరా మహిళా శక్తి స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వం ఈ ఏడాది మహిళా సంఘాల సభ్యులకు చిలక పచ్చ చీరలను పంపిణీ చేయనుంది. తాజాగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కొత్త చీరల డిజైన్‌ను ఆవిష్కరించారు. సిరిసిల్లలోని 130 మరమగ్గాల సొసైటీలకు కోటి చీరల తయారీ ఆర్డర్ ఇచ్చారు. కాగా అక్టోబర్ నాటికి చీరలను సిద్ధం చేస్తే నవంబర్ 19న మహిళలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.