1971
భారత్-పాకిస్థాన్ యుద్ధంలో విశేష సేవలందించిన, మావోయిస్టుల తిరుగుబాటుకు ఆధునిక అటవీ యుద్ధ తంత్ర రూపకర్త అయిన రిటైర్డ్ బ్రిగేడియర్ బసంత్‌కుమార్ పొన్వార్ (77) బుధవారం కన్నుమూశారు. ఆయన ఇద్దరు కుమారులు సైన్యంలో సేవలందిస్తున్నారు. 1969లో సైన్యంలో చేరిన పొన్వార్, 1971 యుద్ధంలో కీలక పాత్ర పోషించారు. సైన్యం నుంచి రిటైర్ అయ్యాక ఛత్తీస్‌గఢ్ పోలీసు విభాగంలో ఐజీగా పనిచేస్తూ, నక్సల్స్‌ను ఎదుర్కొనేందుకు 37 వేల మందికిపైగా పోలీసులకు శిక్షణ ఇచ్చే కౌంటర్ టెర్రరిజం అండ్ జంగిల్ వార్‌ఫేర్ కాలేజ్‌ను స్థాపించారు.