
భార్య వదిలి వెళ్లిందన్న కోపంతో తండ్రిని కొట్టి చంపిన కొడుకు
గుజరాత్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దాహోద్ జిల్లాలో తాగుడుకు బానిసైన బాబూభాయ్ పర్గి అనే వ్యక్తి.. తన భార్య వెళ్లిపోవడానికి కన్నతండ్రే కారణమని భావించి, 70 ఏళ్ల వృద్ధుడైన వాలాభాయ్ పర్గిని కర్రతో కొట్టి హత్య చేశాడు. కుటుంబసభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి చిన్న కుమారుడు ఫిర్యాదు మేరకు పోలీసులు బాబూభాయ్పై హత్య కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.




