AP: ఆదిలాబాద్ రిమ్స్‌లో ఐదుగురు పసికందుల మృతిపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ఆమె ఆరోపించారు. రిమ్స్‌లో వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కొరతతో పాటు మౌలిక వసతుల లోపం ఉందని, 150 ఏసీలు ఉన్నా మెకానిక్ లేకపోవడం, కేవలం ముగ్గురు ఎలక్ట్రీషియన్లు ఉండటం పరిస్థితిని తెలియజేస్తోందని కవిత పేర్కొన్నారు.