ఇన్ఫ్లుయెన్సర్ను కాల్చి చంపిన దుండగులు (వీడియో)

11చూసినవారు
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మ్యాడ్‌ సంధు అలియాస్‌ మధుసూదన్‌ను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నడిరోడ్డుపై కాల్పులు జరిపి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన సంధును ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మేకప్‌ ఆర్టిస్ట్‌, వ్యాపారవేత్తగా ఉన్న ఆయన కొన్ని పంజాబీ సినిమాల్లోనూ నటించారు. ఎల్‌జీబీటీక్యూ+ హక్కులపై బహిరంగంగా మాట్లాడే సంధుకు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్