మరోసారి 72 గంటల పని విషయంపై మాట్లాడిన ఇన్ఫోసిస్ ఫౌండర్ మూర్తి

13195చూసినవారు
మరోసారి 72 గంటల పని విషయంపై మాట్లాడిన ఇన్ఫోసిస్ ఫౌండర్ మూర్తి
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గతంలో వారానికి 72 గంటలు పనిచేయాలన్న వ్యాఖ్యను తాజాగా మరోసారి సమర్థించారు. రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, చైనాను ఆదర్శంగా తీసుకుని భారత్‌ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో 9AM-9PM, ఆరు రోజుల పని విధానం దేశ అభివృద్ధికి తోడైందని, భారత పని సంస్కృతిలో కూడా మార్పు అవసరమని సూచించారు. కాగా ఈ వ్యాఖ్యలు నెట్టింట మరోసారి చర్చకు దారి తీశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్