AP: చిత్తూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. సోమల మండలం ఎర్రంవారిపల్లెలో అప్పుడే పుట్టిన ఆడబిడ్డను పేడదిబ్బలో పడేసి వెళ్లిపోయిందో తల్లి. చంద్రకళ అనే మహిళ అటుగా వెళ్తుండగా బిడ్డ ఏడుపు వినిపించింది. వెళ్లి చూడగా రక్తపు మడుగులో ఆడబిడ్డ కనిపించింది. చంద్రకళ శిశువును ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించింది. స్థానిక అధికారుల సహాయంతో సోమల పీహెచ్‌సీకి తీసుకొచ్చి చికిత్స చేయించారు. అనంతరం PSలో ఫిర్యాదు చేశారు.