
లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
యూఏఈలోని అబుధాబి లాటరీలో ఓ భారతీయుడు జాక్ పాట్ కొట్టాడు. అబుధాబిలో నిర్వహించే ప్రముఖ లాటరీ అయిన ‘బిగ్ టికెట్ అబుధాబి 280’ సిరీస్‌లో తమిళనాడుకు చెందిన శరవణన్ వెంకటాచలం రూ.60.42 కోట్లు (25 మిలియన్ దిర్హామ్‌లు) గెలుచుకున్నారు. అక్టోబర్ 30న ఆయన కొనుగోలు చేసిన ‘463221’ నంబర్ టికెట్ విజేతగా నిలిచింది. నవంబర్ 3న జరిగిన డ్రాలో ఈ ఫలితాన్ని ప్రకటించారు. నిర్వాహకులు శరవణన్‌ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేరని తెలిపారు.




