AP: కూటమి ప్రభుత్వంలో జనసేనకు అన్యాయం జరుగుతోందని, కూటమి ఒప్పందం క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ ఆరోపించారు. పదవుల విషయంలో 60-30-10 విధానం కాగితాలకే పరిమితమైందని, దేవాలయ కమిటీల్లో జనసేనకు ప్రాతినిధ్యం లేదని, విశాఖ ఈస్ట్‌లో ఏర్పాటు చేసిన ఐదు దేవాలయ కమిటీల్లో ఒక్కటి కూడా జనసేనకు ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు.