రాజస్థాన్‌లోని కుచామన్ నగరంలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో రిటర్న్ గిఫ్టులు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. మనోజ్ బర్వాల్ అనే వ్యక్తి తన కుమార్తె సోనూ–యశ్ బెద్వాల్ వివాహానికి వచ్చిన అతిథులకు బహుమతులుగా హెల్మెట్లు అందజేశారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మొత్తం 286 హెల్మెట్లు పంపిణీ చేయగా, ఈ నిర్ణయాన్ని నెటిజన్‌లు అభినందిస్తున్నారు.